: కోట్లు ఖరీదు చేసే ఈ ఎద్దులను కొనే శక్తి ఉందా?
పంజాబ్ లో వ్యవసాయ సదస్సు ఈ నెల 16 నుంచి జరుగుతోంది. నేటితో ముగిసే ఈ సదస్సు ఎన్నో అద్భుతాలకు వేదికైంది. మహారాజుల్లాంటి ఖరీదైన ఎద్దులను తీసుకుని యజమానులు దీనికి తరలివచ్చారు. రాజు అనే ముర్రా జాతి ఎద్దు ఇప్పటి వరకు పలు ప్రదర్శనల్లో 18 లక్షల రూపాయల బహుమతులను గెలుచుకుంది. కపుర్తలాకు చెందిన దీని యజమాని సంతోష కమల్.. రాజు తనకు బిడ్డతో సమానమని చెప్పాడు. 10కోట్లు ఇస్తాం.. రాజును ఇవ్వమని ఎంతో మంది అడిగారు. అయినా అమ్మలేదు. నేను అమ్మే ప్రసక్తే లేదని అంటున్నాడు సంతోష్.
ముర్రా జాతికే చెందిన మరో ఎద్దు పేరు యువరాజ్. కురుక్షేత్రకు చెందిన కరంవీర్ సింగ్ దీని యజమాని. ఏసీ రూములో బస ఏర్పాటు చేసి మరీ యువరాజ్ ను ముద్దుగా పెంచుతున్నాడు కరంవీర్ సింగ్. ఇది కూడా కోట్ల రూపాయలు పలుకుతోంది. పలు ప్రదర్శనల్లో దీనికి 2లక్షల రూపాయల బహుమతులు లభించాయి. మరో విశేషం ఏమిటంటే యువరాజు వీర్యం అమ్మకం ద్వారా కరంవీర్ సింగ్ కు ఏటా 40లక్షల రూపాయల ఆదాయం సమకూరుతోంది.