: ముఖ్యమంత్రిగా కిరణ్ ప్రస్థానం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 16వ ముఖ్యమంత్రిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహరించారు. 25 నవంబర్ 2010న కిరణ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 19 ఫిబ్రవరి 2014 పదవికి రాజీనామా చేశారు. 3 సంవత్సరాల 2 నెలల 27 రోజుల (39 నెలల) పాటు ఆయన సీఎంగా రాష్ట్రానికి సేవలందించారు. మొత్తం మీద 1182 రోజుల పాటు ఆయన ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు. గతంలో శాసనసభ స్పీకర్ గా వ్యవహరించిన నల్లారి మంత్రి పదవిని కూడా చేపట్టకుండానే.. నేరుగా ముఖ్యమంత్రి పదవి చేపట్టి చరిత్ర సృష్టించారు. తన పదవీ కాలంలో ఎన్నో సంక్షోభాల్ని ఎదుర్కొన్న కిరణ్, అన్నింటినీ విజయవంతంగా ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆయన తనదైన వర్గాన్ని కూడా ఏర్పాటు చేసుకోగలిగారు. తాను ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్ర విభజన జరగనీయనంటూ మొదట్నుంచి చెబుతున్న కిరణ్, రాష్ట్ర విభజనకు అనుకూలంగా లోక్ సభలో బిల్ పాస్ అయిన మరుసటి రోజే పదవికి రాజీనామా చేయడం గమనార్హం.