: పోటీ పరీక్షల కోసం పంపితే.. టక్కుటమార విద్యలు నేర్చింది!


ఆ అమ్మాయి పేరు సరితా కులకర్ణి. మహారాష్ట్రలోని హింగోలి జిల్లాకు చెందిన ఈ 22 ఏళ్ళ యువతిని ఆమె తల్లిదండ్రులు పోటీ పరీక్షలకు సంసిద్ధమవ్వమని ఔరంగాబాద్ పంపారు. ఆర్నెల్లక్రితం నగరానికి వచ్చిన ఈ యువతి చక్కగా చదువుకోకుండా, టక్కు, టమార, గజకర్ణ, గోకర్ణ విద్యల్లో ప్రావీణ్యం సంపాదించింది. పోలీసు వేషంలో పలువురికి టోపీ పెట్టింది. చివరికి మహిళా కానిస్టేబుళ్ళనే బుట్టలో వేసే ప్రయత్నంలో పట్టుబడింది. వివరాల్లోకెళితే..

శిక్షణ పూర్తి చేసుకున్న ఇద్దరు మహిళా కానిస్టేబుళ్ళను నగరంలోని సిడ్కో పోలీస్ స్టేషన్ కు కేటాయించారు. వారిద్దరూ సెంట్రీ విధుల్లో ఉండగా, ఈ మాయలాడి వారి వద్దకు వెళ్ళి తనను సబ్ ఇన్ స్పెక్టర్ గా పరిచయం చేసుకుంది. తానూ ఇటీవలే శిక్షణ పూర్తి చేసుకున్నానని, ఇదే స్టేషన్ లో పనిచేస్తున్నానని, తనకు ఆర్థిక అవసరాలు ఎక్కువగా ఉన్నాయని, డబ్బు సర్దాలని కోరింది.

ఆ ఇద్దరు మహిళా పోలీసుల్లో ఒక యువతికి అనుమానమొచ్చి, పై అధికారులకు సమాచారం అందించింది. దీంతో, వారు విచారించగా, కొత్తగా ఏ సబ్ ఇన్ స్పెక్టర్ నూ సిడ్కో స్టేషన్ లో నియమించలేదని తెలిసింది. దీంతో, ఆ కిలాడీని అదుపులోకి తీసుకుని విచారిస్తే, వివరాలు బయటికొచ్చాయి. అంతకుముందు, తాను పోలీస్ నని చెప్పి మరో ఇద్దరి వద్ద నుంచి లక్షా అరవై వేల రూపాయలు తీసుకున్నానని వెల్లడించింది.

  • Loading...

More Telugu News