: కేవీపీకి సీబీఐ నోటీసులు
వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో దివంగత వైఎస్ రాజశేఖరెడ్డికి సన్నిహితుడు, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావుకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో రేపు ఉదయం 10 గంటలకు విచారణ నిమిత్తం హైదరాబాదులోని సీబీఐ కార్యాలయంలో తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది.
సీబీఐకు అన్ని విషయాలలో సహకరిస్తానని నోటీసులు అందుకున్న కేవీపీ తెలిపారు. ఇప్పటికే ఈ కేసులో పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్ చంచల్ గూడ జైలులో ఉన్న సంగతి తెలిసిందే!