: ఆంధ్రా యూనివర్సిటీలో హోరెత్తిన నిరసన
ఆంధ్రా యూనివర్సిటీలో సమైక్య సెగలు రేగాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును ఆమోదించడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనివర్సిటీకి ఇరువైపులా ఉన్న రోడ్లను దిగ్బంధించారు. సిరిపురం కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద టైర్లను కాల్చి పడేశారు. సోనియా, షిండే, బీజేపీ, కేంద్ర మంత్రుల దిష్టిబొమ్మలు తగులబెట్టారు. సోనియాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధికార, ప్రతిపక్షాలు కుమ్మక్కై ప్రజాకాంక్షను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రేపు యూనివర్సిటీల బంద్ కు పిలుపునిచ్చారు.