: ద్రోహం కాదు ... ఇది దేశద్రోహం: మంత్రి కాసు
కాంగ్రెస్ పార్టీ చేసింది రాష్ట్రానికి ద్రోహం కాదని, దేశ ద్రోహమని మంత్రి కాసు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ తెలుగు ప్రజల మీద కాంగ్రెస్ అధిష్ఠానం ఇంత కక్షకట్టిందా? అని ఆశ్చర్యపోయారు. ఇంత దమననీతి, దుశ్చర్య, దారుణం, అన్యాయం మరోకటి ఉండదని విమర్శించారు. కాంగ్రెస్ అధిష్ఠానం దేశానికి ద్రోహం చేసిందని, దేశంలో దారుణమైన సంస్కృతిని ప్రవేశపెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటులో ఘర్షణలు, అల్లకల్లోలానికి కాంగ్రెస్ పార్టీ కారణమని ఆయన నిప్పులుకక్కారు.