: తెలంగాణ కల సాకారమైంది: దామోదర రాజనర్సింహ
తెలంగాణ పోరాటం ప్రజా పోరాటమని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఇన్నాళ్లకు తెలంగాణ కల సాకారమైందని అన్నారు. రాష్ట్ర విభజనను సీమాంధ్ర నేతలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అర్ధం కావడం లేదని అన్నారు. తెలంగాణ కూడా భారతదేశంలో భాగమేనని, కొత్త రాష్ట్రం కాదని ఆయన అన్నారు. ఒకప్పటి హైదరాబాదు రాష్ట్రమే మళ్లీ పురుడు పోసుకుందని దామోదర తెలిపారు.