: విభజన తప్పుకాదు, విభజించిన తీరే తప్పు: చంద్రబాబు


ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతున్న చంద్రబాబు విభజనపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. విభజన తప్పు అని ఎన్నడూ చెప్పలేదని, విభజిస్తున్న తీరే తప్పు అని చెబుతున్నామని స్పష్టం చేశారు. జులై 30 నుంచి నేటి దాకా కాంగ్రెస్ పార్టీ అవలంబించిన తీరు బాధాకరమని అన్నారు. విద్వేషాలు సృష్టించవద్దు, విషబీజాలు నాటవద్దు అని ఎన్నోసార్లు చెప్పామని వివరించారు. తాత్కాలిక ప్రయోజనాల కోసం ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టారని దుయ్యబట్టారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్రలో జగన్ ను సమైక్య హీరోగా చూపే ప్రయత్నం జరిగిందని ఆరోపించారు. జగన్ సమైక్య ముసుగులో ఉన్న విభజన వాది అని బాబు స్పష్టం చేశారు. ఇక, సమన్యాయం కోసం తాను చేయాల్సిందంత చేశానని బాబు ఉద్ఘాటించారు. తగిన సంఖ్యాబలం లేనందువల్ల సభలో తమ వాణిని సమర్థంగా వినిపించలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు నెలలుగా ఎంతో ఆవేదన అనుభవించానని చెప్పారు.

  • Loading...

More Telugu News