: ప్రజాస్వామ్యాన్ని పక్కనబెట్టారు: పళ్లంరాజు
లోక్ సభలో తెలంగాణ బిల్లును ఆమోదింపజేయడంలో కేంద్రం ప్రజాస్వామ్య విధానాలను పక్కన పెట్టిందని కేంద్రమంత్రి పళ్లం రాజు అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, సీమాంధ్ర ప్రజల సమస్యలు పరిష్కరించకుండా విభజన చేయడం బాధాకరమని అన్నారు. అధికారంలో ఉన్నాం కనుక ఏం చేసినా చెల్లుతుందనుకోవడం సరికాదని హితవు పలికారు.