: నావికులను తిప్పి పంపిస్తున్న ఇటలీ
భారత్ ఒత్తిడికి ఇటలీ దేశం దిగివచ్చింది. కేరళలో ఇద్దరు జాలర్ల హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న ఇటలీ నావికాదళ సిబ్బందిని తిప్పిపంపడానికి ఆ దేశం అంగీకరించింది. ఓటు హక్కు వినియోగించుకునే మిషతో, సుప్రీం కోర్టు అనుమతితో ఇటలీ వెళ్ళిన ఇద్దరు నావికాదళ సభ్యులనూ ఇక భారత్ కు తిరిగి పంపేది లేదంటూ మాట మార్చిన ఇటలీ, ఎట్టకేలకు మనసు మార్చుకుని వారిని ఈ రోజు తిరిగి పంపిస్తోంది.
వారిని పంపేది లేదంటూ ఇటలీ ప్రభుత్వం ఆమధ్య చేసిన ప్రకటనపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా, దేశం విడిచి వెళ్ళకుండా ఇటలీ రాయబారిపై ఆంక్షలు కూడా విధించిన సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ పెంచిన ఒత్తిడికి ఇటలీ తలొగ్గి, నిందితులను తిరిగి భారత్ కు అప్పగిస్తోంది.