: బిల్లును ఆపే అవకాశం ఇంకా ఉంది: చిరంజీవి
లోక్ సభలో విభజన బిల్లు ఆమోదం పొందినా బిల్లును ఆపే అవకాశం ఇంకా తమకు ఉందని కేంద్రమంత్రి చిరంజీవి ధీమా వ్యక్తం చేశారు. రేపు రాజ్యసభ ముందుకు బిల్లు రానున్న నేపథ్యంలో చిరు ఈ విధంగా మాట్లాడినట్లు తెలుస్తోంది. అయితే, ఇది విభజనపై అప్రజాస్వామికంగా తీసుకున్న నిర్ణయమని, సీమాంధ్ర ప్రజలకు న్యాయం చేయాలని మొదటినుంచీ కేంద్ర మంత్రులందరమూ చెబుతూ వచ్చామన్నారు.