: మోడీ తన తప్పు తెలుసుకోవడంలేదు: చిదంబరం


కేంద్ర ఆర్ధిక మంత్రి చిదంబరం బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై విమర్శనాస్త్రాలు సంధించారు. గుజరాత్ అల్లర్లకు సంబంధించి మోడీ ఇంకా తన తప్పు తెలుసుకోవడం లేదని వ్యాఖ్యానించారు. ఆ కల్లోలానికి సంబంధించి మోడీ క్షమాపణ చెప్పకోవడం తనకు అసంతృప్తి కలిగిస్తోందన్నారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. అల్లర్ల విషయమై ఒక కోర్టు మోడీని తప్పుబట్టిందని, మరో కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందని.. దానిపై తాను మాట్లాడబోనని చెప్పారు. కానీ, నైతిక బాధ్యత వహించి మోడీ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని చిదంబరం అభిప్రాయపడ్డారు. మోడీ సాగిస్తున్న దేశవ్యాప్త ప్రచారానికి త్వరలోనే కాంగ్రెస్ పార్టీ దీటుగా బదులిస్తుందని చెప్పారు.

  • Loading...

More Telugu News