: రాష్ట్రంలో ఎన్నికలెప్పుడొచ్చినా సిద్ధమంటున్న టీడీపీ


రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలుగుదేశం పార్టీ స్పష్టం చేసింది. సహకార సంఘాల ఎన్నికల్లో అధికార దుర్వినియోగంతోనే కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సొసైటీలను గెలుచుకుందని టీడీపీ నేత కంభంపాటి రామ్మోహనరావు ఆరోపించారు.

రాష్ట్రంలో ఎనిమిదిన్నర ఏళ్లలో విపత్తుల సాయం కోసం కేంద్రాన్ని 50 వేల కోట్లడిగితే కేవలం నాలుగు శాతం నిధులు విదిల్చిందని ఆ పార్టీ మరో నేత కళా వెంకట్రావు విమర్శించారు. రాష్ట్రంలో జే.ఎన్.ఎన్.యూ.ఆర్.ఎం. పథకంలో కాగ్ బయటపెట్టిన భారీ అక్రమాలపై సీబీఐ లేదా కేంద్ర విజిలెన్స్ కమిషన్ తో విచారణ జరిపించాలని కంభంపాటి డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News