: టీఆర్ఎస్ భవన్ లో మిన్నంటిన సంబరాలు


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు లోక్ సభలో ఆమోదం పొందటంతో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రధాన కార్యాలయమైన టీఆర్ఎస్ భవన్ వద్ద సంబరాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ నేతలంతా రంగులు చల్లుకుని బాణసంచా కాలుస్తూ ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు.

నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కల సాకారం అయ్యిందని, ఇది ఎవరి విజయమో లేదా మరొకరి అపజయమో కాదని టీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నారు. సీమాంధ్ర సోదరులకు అన్యాయం జరగదని, హైదరాబాదులోని సీమాంధ్రులు అభద్రతకు లోను కావద్దని కేటీఆర్ అన్నారు. ఇది తెలంగాణ ప్రజల విజయమని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News