: కేసీఆర్ మాలో భాగమే.. ప్రత్యేకంగా కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం లేదు: కోదండరాం
ఈ విజయం తెలంగాణ అమరవీరులకు అంకితమని ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. ఇది ఎవరి విజయమూ కాదు, ఎవరి ఓటమీ కాదని అన్నారు. ప్రాంతాలుగా విడిపోతున్నామే కాని, సోదరులుగా కాదని అన్నారు. సీమాంధ్రులతో సన్నిహిత సంబంధాలు కొనసాగుతాయని ఆయన వెల్లడించారు. సుష్మా, షిండే, అరుణ్ జైట్లీలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్ ఉద్యమంలో భాగమే అని... ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలపాల్సిన అవసరం లేదని చెప్పారు.