: నా జీవితంలో ఊహించని రోజిది: మోదుగుల
భారతదేశంలోని ప్రజలందరికీ న్యాయం చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం ఐదున్నర కోట్ల మంది ప్రజల గొంతులు కోసిన ఘటన లోక్ సభలో చోటు చేసుకుందని టీడీపీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ తన జీవితంలో ఊహించని రోజు నేడు చోటు చేసుకుందని అన్నారు. లోక్ సభలో ఏక పక్షంగా వ్యవహరించడం అంటే ప్రజలను పార్లమెంటు సాక్షిగా హత్య చేయడమేనని ఆయన అన్నారు. స్పీకర్, షిండే, కమల్ నాథ్ లు సీమాంధ్ర ద్రోహులని ఆయన అన్నారు.