: రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిలా తయరైంది: డీఎల్
వైఎస్ మరణంతో రాష్ట్ర రాజకీయాల్లో అనిశ్చితి ఏర్పడిందని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి అన్నారు. మైదుకూరులో ఆయన మాట్లాడుతూ, రాజశేఖర రెడ్డి మరణం తరువాత జరిగిన ఘటనలతో రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిలా తయారైందని అన్నారు. బలహీన సీఎం కావడం, రాష్ట్రంలోని ఇరు ప్రాంతాల్లో ఉద్యమాలు చేలరేగడం వంటి కారణాలతో గాంధీ పుట్టిన దేశంలో ఏమైపోతున్నామో అని డీఎల్ ఆవేదన వ్యక్తం చేశారు.