: ఆంధ్రప్రదేశ్ ను ఐక్యంగా ఉంచాలని మోడీకి చంద్రబాబు విజ్ఞప్తి


రాష్ట్ర విభజన చివరి అంకంలో ఉన్న సమయంలో ఢిల్లీలో కసరత్తులు చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఇరు ప్రాంతాలకు సమన్యాయం జరగాలని ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ను ఐక్యంగా ఉంచాలని బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. తెలంగాణ సమస్యకు ఒక స్నేహపూర్వకమైన పరిష్కారం దొరికేంతవరకు తనకున్న (మోడీ) పరపతిని ఉపయోగించి రాష్ట్రాన్ని కలిపే ఉంచాలని కోరినట్లు చెప్పారు. ఈ విషయంపై తాను మోడీని కలిసి కోరానని, విభజన విషయంలో కాంగ్రెస్ వ్యవహరిస్తున్న విధానాన్ని, ఉల్లంఘనలను పూర్తిగా వివరించినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే మోడీని కోరినట్లు మీడియాకు బాబు వెల్లడించారు.

  • Loading...

More Telugu News