: రేపు అమేథీకి రాహుల్ గాంధీ
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తన నియోజకవర్గమైన ఉత్తరప్రదేశ్ లోని అమేథీలో మంగళవారం పర్యటించనున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన తొమ్మిది కొత్త శాఖలను ప్రారంభిస్తారు. గౌరీగంజ్ లో ఎఫ్ఎం రేడియో స్టేసన్ ను ఆరంభించడం సహా పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. రాత్రికి తిరిగి ఢిల్లీకి చేరుకుంటారు.