: దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందట!
భారత దేశం ప్రస్తుతం చాలా ప్రమాదంలో ఉందని బీజేపీ నేత ఎన్. ఇంద్రసేనారెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. సోనియా, మన్మోహన్ సింగ్ ల ఆధ్వర్యంలోని యూపీఏ పాలనతో ప్రజలు విసిగిపోయారని ఆయన చెప్పుకొచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు.
అన్నీ గమనిస్తున్న ప్రజలు భవిష్యత్తులో బీజేపీకే పట్టం కడతారని ఆయన జోస్యం చెప్పారు. యూపీఏ నుంచి వైదొలిగిన వెంటనే డీఎంకే నాయకుల ఇళ్ళలో సీబీఐ సోదాలకు ఉపక్రమించడాన్ని ఆయన తప్పుబట్టారు. దీన్ని కాంగ్రెస్ దివాళాకోరుతనానికి నిదర్శంలానే భావించాల్సి ఉంటుందని ఇంద్రసేనారెడ్డి అన్నారు.