: చలి దుప్పట్లో ఎడారి
అత్యధిక ఉష్ణోగ్రతలకు పెట్టింది పేరైన రాజస్థాన్ లో ఇప్పుడు ఆశ్చర్యకరంగా చలిగాలులు వీస్తున్నాయి. ఎంతలా అంటే, కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. మౌంట్ అబూలో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రత 0.5 డిగ్రీలుగా నమోదైంది. ఇక రాత్రివేళల్లో ఉష్ణోగ్రత 3 నుంచి 8 డిగ్రీలుగానే ఉంటోంది. ఎప్పుడూ అధిక వేడిమితో ఇబ్బందులు పడే రాజస్థాన్ వాసులు గజగజ వణుకుతున్నారు. పశ్చిమదిశ నుంచి వీస్తున్న శీతల గాలుల కారణంగానే ఉష్ణోగ్రతలు పడిపోయాయని అక్కడి వాతావరణ శాఖ అంటోంది. మరో 24 గంటలపాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని తెలిపింది.