: హైదరాబాదుని యూటీ చేస్తేనే సీమాంధ్రులకు రక్షణ: పళ్లంరాజు
హైదరాబాదులో నివసిస్తున్న సీమాంధ్రులు ప్రస్తుతం భయం నీడన ఉన్నారని కేంద్ర మంత్రి పళ్లం రాజు అన్నారు. హైదరాబాదుని యూటీ చేయడం ద్వారానే వారి భయాందోళనలను పోగొట్టగలమని చెప్పారు. ప్రజల కోసం యూటీ చేయడం పెద్ద సమస్య కాదని తెలిపారు. కొత్త రాజధాని నిర్మాణం పూర్తయిన తర్వాత, యూటీని ఎత్తివేయవచ్చని సూచించారు.