: విజయ్ చౌక్ లో తీవ్ర ఉద్రిక్తత
విజయ్ చౌక్ లో ఉన్న సీమాంధ్ర ఎంపీలు, ఎమ్మెల్యేలను పోలీసులు బలవంతంగా బయటకు పంపుతున్నారు. దీంతో పోలీసులు, ప్రజాప్రతినిధులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కీలకమైన రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులు సభలో లేకుండా రాష్ట్రాన్ని ముక్కలు చేయడం దారుణమని వారు వాపోతున్నారు. ఇంత కంటే దుర్మార్గం ఎక్కడా ఉండదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.