: మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ
మహారాష్ట్రలో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గతరాత్రి కోర్చి తాలూకా బేడ్కతి గ్రామం వద్ద అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్లో ఏడుగురు నక్సల్స్ మృతి చెందారు. మరణించిన మావోయిస్టుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. సంఘటన స్థలం నుంచి ఒక ఏకే-47, రెండు ఎస్ఎల్ఆర్ లు, ఓ కార్బైన్ స్వాధీనం చేసుకున్నారు. సీఆర్పీఎఫ్ దళాలతో కలిసి గడ్చిరోలి, గోండియా జిల్లాల పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించారు. కాగా, ఈ కాల్పుల్లో ఉమేశ్ అనే కమాండో కూడా ప్రాణాలు విడిచాడు.