: బంగారానికి 13 శాతం పెరిగిన డిమాండ్
బంగారంపై దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం గతేడాది ఎన్నో ఆంక్షలను అమల్లోకి తెచ్చినా డిమాండ్ పెరగడం విశేషం. 2013లో భారత్ 975 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకున్నట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వెల్లడించింది. ఇది 2012లో దిగమతులతో పోలిస్తే 13 శాతం ఎక్కువని తెలిపింది. 2012లో 864 టన్నుల బంగారం దిగుమతి అయింది. అయితే, 2013లో మొదటి ఆరు నెలల కాలం కంటే తర్వాతి అరు నెలల కాలంలో ప్రభుత్వ ఆంక్షల వల్ల దిగుమతులు తగ్గాయని పేర్కొంది. 2013లో బంగారు ఆభరణాల డిమాండ్ చూస్తే 11 శాతం పెరిగి 612 టన్నులుగా నమోదైంది.