: తెలంగాణ బిల్లుకు సహకరిస్తాం: ప్రకాశ్ జవదేకర్
పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు సహకరిస్తామని బీజేపీ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. అయితే, తెలంగాణ బిల్లుపై సామరస్యపూర్వకంగా సభలో చర్చ జరగాలన్నారు. తెలంగాణ అంశాన్ని కాంగ్రెస్ గందరగోళం చేసిందన్న జవదేకర్, ఆంధ్రప్రదేశ్ లోని 3 ప్రాంతాలకు పన్ను రాయితీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.