: సీమాంధ్ర జిల్లాల్లో భద్రత పెంచండి: కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ
రాష్ట్ర విభజన తుది అంకానికి చేరుకోవడంతో... కేంద్ర హోం శాఖ అలర్టయింది. విభజన జరిగితే సీమాంధ్ర జిల్లాల్లో భారీ ఎత్తున హింసాత్మక ఘటనలు చెలరేగే అవకాశం ఉండటంతో, భద్రతను కట్టుదిట్టం చేయాలని రాష్ట్ర పోలీస్ యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసింది. అత్యంత సమస్యాత్మకంగా ఉండే అనంతపురం, కడప, విజయవాడ, విజయనగరంతో సహా అన్ని జిల్లాలో కేంద్ర బలగాలను మోహరింపజేయాలని హుకుం జారీ చేసింది. అవసరమైతే అదనపు బలగాలను పంపుతామని తెలిపింది.