: నెలన్నరలో ఆకాశ్-4 టాబ్లెట్: సిబల్
చౌక టాబ్లెట్ పీసీ ఆకాశ్-4 మరో నెలన్నర రోజుల్లో మార్కెట్లోకి వస్తుందని కేంద్ర మంత్రి కపిల్ సిబల్ తెలిపారు. ధర 3,999 రూపాయలని, కొనుగోలు కోసం ఇప్పటికే టెండర్లు పిలిచినట్లు చెప్పారు. విద్యార్థులకు చౌకగా అందించే లక్ష్యంతో మానవవనరుల అభివృద్ధి శాఖా మంత్రిగా ఉన్నప్పుడు కపిల్ సిబల్ ఆకాశ్ టాబ్లెట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. డేటావిండ్ కార్పొరేషన్ వీటిని సరఫరా చేస్తోంది. 7 అంగుళాల స్ర్కాచ్ రహిత కెపాసిటేటివ్ టచ్ స్క్రీన్, వైఫై, 2జీ, 3జీలతోపాటు 4జీని కూడా ఆకాశ్-4 సపోర్టు చేస్తుంది.