: సార్వత్రిక ఎన్నికల వ్యయ భారం రూ.3,500 కోట్లు


సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు రూ.3,500కోట్ల వ్యయం కానున్నట్లు ఎన్నికల సంఘం అంచనా వేస్తోంది. 2009లో అయిన వ్యయం రూ.1,400 కోట్ల కంటే ఇది 150 శాతం అదనం. రూ.3,500 కోట్లు కూడా కేవలం ఎన్నికల నిర్వహణకు అయ్యే వ్యయమే. భద్రతా దళాల ఖర్చు ఇందులో కలపలేదు. అలాగే రాజకీయ పార్టీలు, అభ్యర్థులు వ్యక్తిగతంగా చేసే ఖర్చు అదనం. ఈ వ్యయ అంచనా కూడా ప్రాథమికమేనని, చివరికి ఇంతకంటే ఎక్కవ లేదా తక్కువ కావచ్చని ఎన్నికల సంఘం అధికారి ఒకరు తెలిపారు.

  • Loading...

More Telugu News