: బిల్లుకు మద్దతు ఇవ్వమని బీజేపీ నేతలు చెప్పారు: కావూరి
రాష్ట్ర విభజన వ్యవహారం చివరి అంకానికి చేరుకున్నప్పటికీ, సీమాంధ్ర కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు మాత్రం విభజన కచ్చితంగా ఆగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, లోక్ సభలో బిల్లు ఎట్టి పరిస్థితుల్లో పాస్ కాదని అన్నారు. సీమాంధ్ర ప్రాంతానికి న్యాయం జరగకుండా, విభజన బిల్లుకు మద్దతివ్వమని బీజేపీ అగ్ర నేతలు తమతో చెప్పారని కావూరి తెలిపారు.