: కాంగ్రెస్ పతనం కావడం తథ్యం: చంద్రబాబు
కాంగ్రెస్ పార్టీ వల్ల దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ దేశాన్ని సర్వనాశనం చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ నాటిన విష బీజాలు రాష్ట్రంలోని ఇరు ప్రాంతాల్లో మొలకెత్తాయని ఆరోపించారు. ఈ రోజు ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పతనం తప్పదని... ప్రజలు ఆ పార్టీని తరిమి కొడతారని జోస్యం చెప్పారు.