: రాజీవ్ గాంధీ దోషులకు సుప్రీంలో ఊరట
దివంగత రాజీవ్ గాంథీ హత్య కేసులో దోషులుగా ఉన్న ముగ్గురికి మరణశిక్షను సుప్రీంకోర్టు జీవితఖైదుగా మార్చింది. ఈ మేరకు కోర్టు కొద్దిసేపటి కిందట తీర్పు వెలువరించింది. గత నెలలో తమ మరణ శిక్షను జీవితఖైదుగా మార్చాలంటూ దోషులైన శంతన్, మురుగన్, పెరారివలన్ లు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసుకున్నారు. తాము పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ పై నిర్ణయం ఆలస్యమవడంతో కోర్టును ఆశ్రయించి జీవితఖైదుగా మార్చాలని విజ్ఞప్తి చేశారు.