: బీజేపీపై విష ప్రచారం చేసేందుకు కొందరు ప్రయత్నించారు: కిషన్ రెడ్డి


తెలంగాణపై బీజేపీ మాట మార్చిందంటూ కొందరు విష ప్రచారం చేసేందుకు ప్రయత్నించారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. రాజకీయ స్వలాభం కోసమే తప్పుడు ప్రచారం చేసేందుకు యత్నించారని వ్యాఖ్యానించారు. తెలంగాణ బిల్లు ఆమోదం పొందడం కోసం లోక్ సభలో బీజేపీ సహకరిస్తుందని స్పష్టం చేశారు. అయితే, సీమాంధ్ర సమస్యలు పరిష్కరించాలని కూడా బీజేపీ నేతలు చెప్పారని వివరించారు. ఏదిఏమైనా తెలంగాణ ఏర్పాటు అనివార్యమన్న కిషన్ రెడ్డి అందరూ అర్థం చేసుకోవాలని కోరారు. ఈ సమయంలో ఇరు ప్రాంతాల ప్రజలు సంయమనం పాటించాలన్నారు. మన రాష్ట్ర ఎంపీలను చూసి ప్రపంచమంతా నవ్వుకునే పరిస్థితి ఏర్పడిందని అసహనం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News