: నేడు సీఎం కిరణ్ రాజీనామా !
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన పదవి నుంచి వైదొలగడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై చర్చ మొదలైన వెంటనే పదవికి రాజీనామా చేస్తానని ఇంతకు మునుపే సీమాంధ్ర మంత్రులు, సన్నిహితుల వద్ద చెప్పిన నేపథ్యంలో, అందుకు అనుగుణంగా నిన్ననే తన పేషీని ఖాళీ చేశారు. పేషీలో పనిచేసే ఐఏఎస్ అధికారులకు వేరే శాఖల్లో పోస్టింగ్ లు కూడా ఇచ్చారు. దీంతో ఆయన మధ్యాహ్నం 3 గంటలకు గవర్నర్ ను కలసి రాజీనామా ఇవ్వొచ్చని సమాచారం. ఏదైనా అనివార్యకారణాల వల్ల ఈ రోజు బిల్లు సభ ముందుకు రాకపోతే రాజీనామాను మరో రోజు వాయిదా వేసే అవకాశం ఉందని తెలుస్తోంది.