: భగత్ సింగ్ ఇంటికి కొత్త కళ తెచ్చేందుకు పాకిస్థాన్ యత్నం
భారత స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ జన్మస్థలం పాకిస్థాన్ లోని పంజాబ్ రాష్ట్రంలో ఉంది. లాహోర్ కు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న బంగే గ్రామంలో భగత్ సింగ్ 1907 సెప్టెంబర్ 28న జన్మించారు. ఈ గ్రామంలో ఉన్న ఆయన నివాసం శిథిలావస్థకు చేరడంతో దానికి కొత్త కళ తీసుకొచ్చేందుకు పాక్ ప్రభుత్వం నడుం బిగించింది. ఈ మేరకు రూ.8 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులతో ఇంటిని పునరుద్ధరించడమే గాకుండా, గ్రామంలో ఆయన పేరిట ఉన్న పాఠశాలలో సౌకర్యాలు మెరుగుపర్చనున్నారు. నివాసానికి కొత్త రూపు దిద్దిన తర్వాత ఫైసలాబాద్ మ్యూజియంలో ఉన్న భగత్ సింగ్ వస్తువులను ఇక్కడికి తీసుకురానున్నారు.