: సీమాంధ్ర నేతలు, కేంద్ర ప్రభుత్వం మధ్యే సమస్య: వెంకయ్యనాయుడు


అసలు సమస్య సీమాంధ్ర, తెలంగాణ ప్రజల మధ్య లేదని.. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు, కేంద్ర ప్రభుత్వం మధ్యే ఉందని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు అన్నారు. తమతో చర్చించి ఒప్పుకున్న ప్రతిపాదనలేవీ బిల్లులో లేవని, ఆ ప్రతిపాదనలను కేంద్రం సవరణ రూపంలో తెస్తామంటోందని చెప్పారు. అయితే, సీమాంధ్ర ప్రజల పరిష్కారం విషయంలో కాంగ్రెస్ చిత్తశుద్ధితో వ్యవహరించాలని సూచించారు. మిగులు జలాలపై ఆధారపడి నిర్మిస్తున్న ప్రాజెక్టులపై చట్టబద్ధత కల్పించాలని పేర్కొన్నారు. సీమాంధ్ర కోల్పోతున్న ఆదాయ భర్తీపై సముచిత నిర్ణయం తీసుకోవాలని, సీమాంధ్రకు అసంఘటిత నిధి నుంచి 10వేల కోట్లు కేటాయించాలని... ఉత్తరాంద్ర, సీమలోని పరిశ్రమలకు పదేళ్లు వంద శాతం పన్ను మినహాయింపు ఇవ్వాలని తెలిపామన్నారు. అంతేగాక హిమాచల్ ప్రదేశ్ తరహాలో సీమాంధ్రలో పన్ను మినహాయింపు ఇవ్వాలని కూడా వెంకయ్య తెలిపారు. ఆ తర్వాతే పదేళ్లు 50 శాతం పన్ను మినహాయింపు ఇవ్వాలని చెప్పినట్లు వివరించారు. ఇక సభను సజావుగా నడిపించే బాధ్యత ప్రభుత్వానిదే అని తాము స్పష్టం చేసినట్లు వెంకయ్య వెల్లడించారు.

  • Loading...

More Telugu News