: సొంత పూచీకత్తుపై కేటీఆర్ విడుదల
సడక్ బంద్ కార్యక్రమంలో నేడు అరెస్టయిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే కె.తారకరామారావును సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఆయనతోపాటు సీపీఐ ఎమ్మెల్యే గుండా మల్లేష్ కూడా విడుదలయ్యారు. ఉదయం అదుపులోకి తీసుకున్న వీరిని పోలీసులు షాబాద్ పోలీస్ స్టేషన్లో ఉంచిన సంగతి తెలిసిందే. కాగా, వీరిరువురితో పాటు మరో 50 మంది కార్యకర్తలనూ విడుదల చేశారు.