: కోదండరాంపై కేసు నమోదు


తెలంగాణ ఐకాస కన్వీనర్ కోదండరాంపై పోలీసులు నేడు కేసు నమోదు చేశారు. సడక్ బంద్ కార్యక్రమంలో బస్సుల విధ్వంసానికి నిరసన కారులను పురిగొల్పారన్న ఆరోపణలపై ఆయనపై ఆలంపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, కోదండరాంతో పాటు ఈటెల, జూపల్లి, రాజేందర్ గౌడ్, ఉద్యోగ సంఘం నాయకుడు శ్రీనివాస్ గౌడ్ తదితరులపై 147, 148 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

  • Loading...

More Telugu News