: నన్ను ఎన్నుకోకపోతే మీ తలలు మీరు నరుక్కున్నట్టే: మంత్రి టీజీ


రానున్న ఎన్నికల్లో మంచి వారిని ఎన్నుకోవాలని మంత్రి టీజీ వెంకటేష్ ప్రజలను కోరారు. తాను కర్నూలు నగరాన్ని ఎంతో అభివృద్ధి చేశానని, తనను మరోసారి ఎన్నుకుంటే మరింత అభివృద్ధి చేస్తానని చెప్పారు. కళ్లు లేని వాళ్లకు తాను చేసిన పనులు కనిపించవని అన్నారు. రానున్న ఎన్నికల్లో తనను ఎన్నుకోకపోతే మీ తలలు మీరు నరుక్కున్నట్టే అని తెలిపారు. ఈ రోజు కర్నూలులో రేషన్ కార్డులను పంపిణీ చేసిన అనంతరం టీజీ వెంకటేష్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

  • Loading...

More Telugu News