: గుజరాత్ లోనే అత్యాచారాలు ఎక్కువ: తమ్మినేని
బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీపై సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని రాష్ట్రాల కంటే గుజరాత్ ముందంజలో ఉందని గొప్పలు చెప్పుకుంటున్న మోడీపై విమర్శలు గుప్పించారు. గుజరాత్ రాష్ట్రం అభివృద్ధిలో కాదు.. అత్యాచారాల్లో ముందంజలో ఉందని ఆయన ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వస్తే గుజరాత్ లో జరిగిన మారణహోం దేశమంతటా జరిగే అవకాశముందని ఆయన అన్నారు. మతతత్వం పెరిగి దేశం ముక్కలు కావడం ఖాయమని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని గొప్ప ఉద్యమంగా ఆయన పేర్కొంటూ.. ఆ తరహా ఉద్యమాలు దేశమంతటా ప్రబలే అవకాశం ఉందని తమ్మినేని అభిప్రాయపడ్డారు.