: మరో రూ.1,000కోట్లతో నిర్భయకు చిదంబరం నివాళి


మహిళల భద్రత కోసం, వారి గౌరవాన్ని కాపాడేందుకు గత బడ్జెట్లో కొత్తగా ప్రవేశపెట్టిన నిర్భయ నిధికి చిదంబరం ఈ బడ్జెట్లో రూ.1,000 కోట్లు కేటాయించారు. 2012 డిసెంబర్ లో ఢిల్లీ నడివీధుల్లో పారా మెడికల్ విద్యార్థిని నిర్భయపై ఆరుగురు దారుణంగా అత్యాచారం చేయడం, కొన్ని రోజుల అనంతరం ఆమె కన్నుమూసిన విషయం తెలిసిందే. దీంతో 2013-14 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ లో చిదంబరం నిర్భయ పేరుతో ఒక నిధిని ప్రకటించి రూ.1,000కోట్లను కేటాయించారు. కానీ, అవి వ్యయం కాలేదు.

అయితే, దేశవ్యాప్తంగా ప్రజా రవాణా వాహనాల్లో అలారమ్ సిస్టంను ప్రవేశపెట్టే రూ.1400కోట్ల ప్రాజెక్టుకు జనవరిలో కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మహిళలు ఆపదలో ఉంటే అందరినీ అప్రమత్తం చేయడానికి వీలుగా బటన్లు నొక్కేందుకు వాహనాల్లో ఏర్పాటు చేస్తారు. అలాగే సీసీటీవీలు, జీపీఎస్ టెక్నాలజీని ఈ ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు చేయనున్నారు. ఇప్పడు అదనంగా మరో వెయ్యి కోట్ల ను చిదంబరం కేటాయించడంతో మహిళలకు కొంత అభయం దక్కుతుందనే ఆశిద్దాం.

  • Loading...

More Telugu News