: కమల్ నాథ్ ను నిలదీసిన కేసీఆర్
ఈ రోజు లోక్ సభలో టీబిల్లు చర్చకు రాకపోవడంపై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. ఈ రోజు లోక్ సభ అజెండాలో తెలంగాణ అంశం ఉన్నప్పటికీ, విభజన బిల్లు చర్చకు రాకుండానే సభ అర్ధాంతరంగా వాయిదా పడింది. దీంతో టీబిల్లు చర్చకు ఎందుకు రాలేదంటూ కమల్ నాథ్ ను కేసీఆర్ నిలదీశారు. రేపు కచ్చితంగా చర్చిద్దామని కేసీఆర్ కు కమల్ నాథ్ సమాధానమిచ్చారు.