: ఢిల్లీలో వైఎస్సార్సీపీ ‘సమైక్య ధర్నా’


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించవద్దంటూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ‘సమైక్య ధర్నా’ ప్రారంభమైంది. ఇవాళ (సోమవారం) ఉదయం ప్రత్యేక రైళ్లలో దేశ రాజధాని ఢిల్లీకి వచ్చిన వైఎస్సార్సీపీ శ్రేణులు జంతర్ మంతర్ వద్దకు చేరుకుని ధర్నా చేస్తున్నాయి. తమ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో అక్కడికి చేరుకున్న ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ ఈ ధర్నాలో పాల్గొని జాతీయ మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ నిర్వహించిన ఈ ధర్నాకు సమైక్యవాదులు కూడా భారీ సంఖ్యలో హాజరయ్యారు. మరో పక్క ఏపీఎన్జీవోల ఆధ్వర్యంలో రాంలీలా మైదానంలో ‘మహాధర్నా’ జరుగుతోంది.

  • Loading...

More Telugu News