: చిదంబర మహిమ.. దిగిరానున్న కార్లు, మోటారు సైకిళ్ల ధరలు
బైకులు, స్కూటర్లు, చిన్న కార్లు కొనుక్కోవాలనుకునే సగటు మధ్యతరగతి ప్రజల ఆశలపై కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం పన్నీరు చిలకరించారు. బడ్జెట్లో వీటిపై ఎక్సైజ్ డ్యూటీ 12 శాతం నుంచి 8 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆయా వాహనాల ధరలు తగ్గనున్నాయి. ఈ తగ్గింపు జూన్ 20 వరకు వర్తిస్తుంది. అంటే చిదంబరం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టినందువల్ల అది స్వల్పకాలానికి మాత్రమే అమల్లో ఉంటుంది. ఎన్నికల అనంతరం కొత్త ప్రభుత్వం తిరిగి పూర్తి స్థాయిని బడ్జెట్ ను ప్రవేశపెడుతుంది.
భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ గడ్డు స్థితిని ఎదుర్కొంటోంది. గతేడాది కార్ల అమ్మాకాలు దేశీయంగా 5 శాతం తగ్గిపోయాయి. దీంతో ఆ పరిశ్రమకు ప్రోత్సాహానిచ్చే చర్చల్లో భాగంగా చిదంబరం ఎక్సైజ్ సుంకం తగ్గిస్తూ నిర్ణయాన్ని ప్రకటించారు. మధ్య, పెద్ద స్థాయి కార్ల విభాగంలో సుంకం 20 శాతానికి, స్పోర్ట్స్ కార్లపై సుంకం 24 శాతానికి తగ్గించారు.