: ముఖ్యమంత్రిపై మంత్రులు కొండ్రు, బాలరాజు వ్యాఖ్యలు
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెట్టడం ఖాయమని వార్తలు వస్తున్న నేపథ్యంలో మంత్రులు కొండ్రు మురళి, బాలరాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పదవులు అనుభవించి ఇప్పుడు పార్టీ పెట్టాలని చూస్తున్నారని మంత్రి కొండ్రు అన్నారు. కొత్త పార్టీ పెట్టినా కాంగ్రెస్ నేతలెవ్వరూ వెళ్లరని, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పదవులనుభవించిన వారు పోవడమేంటని ప్రశ్నించారు. ఈ సమయంలో కొత్త పార్టీ పెడితే ప్రజలు ఛీ అంటారని మంత్రి బాలరాజు విమర్శించారు.