: లోక్ సభ లోపలి ద్వారం వద్ద రాజ్యసభ సభ్యుడు!
కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతుండగా టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ లోక్ సభ లోపలి ద్వారం వద్ద నిలుచుని ఉన్నారు. రాజ్యసభ సభ్యుడయిన రమేశ్ లోక్ సభ ద్వారం వద్ద నుంచి చిదంబరం ప్రసంగాన్ని, సభలో సీమాంధ్ర కేంద్ర మంత్రుల నిరసనను కొంతసేపు వీక్షించి వెళ్లిపోయారు. అయితే, రాజ్యసభ సభ్యుడయిన ఆయన లోక్ సభ ద్వారం వద్దకు రావడం గమనార్హం.