: ఆధార్ పరిధిలోకి 57 కోట్ల మంది: చిదంబరం
కేంద్ర ప్రభుత్వం ఆధార్ కు కట్టుబడే ఉందని ఆర్థిక మంత్రి చిదంబరం లోక్ సభలో వెల్లడించారు. ఇప్పటికే, దేశవ్యాప్తంగా 57 కోట్ల మంది ప్రజలు ఆధార్ పరిధిలోకి వచ్చారని ఆయన ప్రకటించారు. 27 పథకాల ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీని అమలు చేస్తున్నట్లు చిదంబరం చెప్పారు. లోక్ సభలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఆయన ఈ విషయాలను వెల్లడించారు.