: ఢిల్లీలో టీ ప్రకంపనలు.. రెండు మెట్రో స్టేషన్ల మూసివేత
ఢిల్లీ టీ ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. తెలంగాణ అంశంపై ఆందోళనలు కొనసాగవచ్చన్న అంచనాల నేపథ్యంలో రెండు మెట్రో స్టేషన్లు మూతపడ్డాయి. పార్లమెంటు సమీపంలోని సెంట్రల్ సెక్రటేరియేట్, ఉద్యోగ్ భవన్ స్టేషన్లు ఈ రెండు మెట్రో స్టేషన్లను ఈ ఉదయం 9 నుంచి సాయంత్రం ఐదింటి వరకు మూసివేయాలని రైల్వే వర్గాలు నిర్ణయించాయి. మెట్రో రైళ్ళ ద్వారా ఆందోళనకారులు పెద్ద ఎత్తున పార్లమెంటు వద్ద మోహరించవచ్చన్న ఢిల్లీ పోలీసుల హెచ్చరిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.