: నేను ఒంటరివాడిని.. అవినీతి అంతు చూడగలను: మోడీ
ఎలాంటి బంధాల్లో ఇరుక్కోని ఒంటరి వారే అవినీతిపై గట్టిగా పోరాడగలరని బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ అన్నారు. తద్వారా ఆ అర్హత తనకు పుష్కలంగా ఉందని చెప్పకనే చెప్పారు. 'నాకు కుటుంబ బాధ్యతలు లేవు. అవినీతి ద్వారా నా వారికి ప్రయోజనం కల్పించే పనులు చేయలేదు' అని మోడీ స్పష్టం చేశారు. ఎలాంటి బాదర బంధీల్లేని వారు, తల్లిదండ్రుల బాధ్యతల్లేని వారే అవినీతి అంతం చూడగలరని చెప్పారు. ఈ మేరకు మోడీ నిన్న జరిగిన పంజాబ్ లోని సుజాన్ పూర్ సభలో మాట్లాడారు.