: గిరిజనుల ప్రేమికుల దినోత్సవం.. నచ్చిన పిల్లతో ఎగిరిపోవడమే!


పాశ్చాత్య సమాజానికి వేలంటైన్స్ డే అయితే.. వారికి భగోరియా పండుగ. వేలంటైన్స్ డే రోజున ప్రేమికులు చెట్టాపట్టాలేసుకుని విహరిస్తుంటారు. అందరూ నిజమైన ప్రేమికులని చెప్పడానికి లేదులేండి. కానీ, భగోరియా పండుగ మాత్రం సంప్రదాయాలను విడువని ప్రేమకు నిదర్శనంగా నిలుస్తుంది. ఈ విశిష్ఠ గిరిజన పండుగ గురించి కొంత తెలుసుకుందాం. ఏటా ఆరు రోజుల పాటు జరిగే ఈ పండుగలో ఎన్నో ట్విస్టులు. మధ్యప్రదేశ్ లోని జాబువా, ధార్, ఖర్గోన్, బార్వాని జిల్లాల్లో గిరిజనులు దీన్ని జరుపుకుంటారు. ఈ సందర్భంగా జరిగే మేళాల్లో యువకులు తమకు నచ్చిన అమ్మాయి చేతిలో తమలపాకు పెట్టి తమ మనసులోని ప్రేమను, ఇష్టాన్ని తెలియపరుస్తారు. అమ్మాయికి ఆమోదం అయితే, ఆ జంట మరుక్షణమే అక్కడి నుంచి కనిపించకుండా పారిపోతుంది.

తల్లిదండ్రులు గ్రీన్ సిగ్నల్ ఇస్తేగానీ, తిరిగి ఇంటికి రారు. అప్పటి వరకూ వారిది అజ్ఞాతవాసమే. ఈ ఏడాది ఈ పండుగ మార్చి 10 నుంచి హోలీ పండుగ అయిన మార్చి 16వరకు జరగనుంది. ఒకప్పటితో పోలిస్తే ఈ పండుగకు ఆదరణ తగ్గినా.. నేటికీ చాలా మంది యువతీ యువకులు ఈ పండుగ పట్ల ఆదరణ చూపుతున్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ పండుగను చూసేందుకు విదేశీయులు సైతం ఆసక్తి చూపుతుండడంతో ప్రత్యేక టూరిజం ప్యాకేజీని ప్రవేశపెట్టినట్లు మధ్యప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ మేనేజర్ జమాలి తెలిపారు. పర్యాటకులను మేళాలకు తీసుకెళతామని చెప్పారు.

  • Loading...

More Telugu News